గూఢచారి సినిమా సీక్వెల్ జీ 2… కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

2018 లో అడవి శేష్ నటించిన గూఢచారి సూపర్ సక్సెస్ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో అడవి శేష్ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరో అప్ డేట్ వచ్చేసింది. గూఢచారికి సీక్వెల్ వచ్చేస్తోంది. దీనికి జీ2 అని పేరు పెట్టేశారు. ఇదే టైటిల్ ఖరారైంది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో బ్లాక్ సూట్‌‌‌‌లో మెషీన్ గన్ పట్టుకుని యాక్షన్‌‌‌‌ మోడ్‌‌‌‌లో కనిపిస్తున్నాడు శేష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌‌‌‌ వర్క్ జరుగుతోంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రీ విజన్ వీడియోను జనవరి 9న ముంబై, ఢిల్లీలో లాంచ్ చేయనున్నారు.

Related Posts

Latest News Updates