‘అడవి రాముడు’ చిత్ర నిర్మాత సూర్యనారాయణ కన్నుమూత

తెలుగు చలనచిత్ర సీనియర్ నిర్మాత, అడవి రాముడు సినిమాను నిర్మించిన ఏ. సూర్యనారాయణ కన్నుమూశారు. ఎన్టీఆర్ తో అడవి రాముడు చిత్రాన్ని ఆయన నిర్మించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… శనివారం తుదిశ్వాస విడిచారు. 1977 లో అడవి రాముడు చిత్రాన్ని సత్యచిత్ర బ్యానర్ పై సూర్యనారాయణ నిర్మించారు. దీనికి కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. వీరు నిర్మించిన ‘కుమార రాజా’ చిత్రంలో హీరో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. అలాగే వీరు నిర్మించిన ‘కొత్త అల్లుడు’ సినిమాలో చిరంజీవి విలన్‌గా నటించారు. శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై తహసిల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978), కొత్త అల్లుడు (1979), కొత్తపేట రౌడీ (1980), ఏది ధర్మం ఏది న్యాయం (1982), ఉద్ధండుడు (1984), భలే తమ్ముడు (1985), అత్తా నీ కొడుకు జాగ్రత్త (1997) తదితర చిత్రాలను వారు నిర్మించారు.

Related Posts

Latest News Updates