తన సరోగసిపై మొదటి సారి నోరువిప్పిన ప్రియాంక చోప్రా…

ప్రియాంక చోప్రా దంపతులు సరోగసీ ద్వారా బిడ్డను పొందడంపై అప్పట్లో చాలానే విమర్శలు వచ్చాయి. దీనిపై అప్పట్లో అంత వివాదం జరిగినా… మారు మాట్లాడలేదు. తాజాగా… ప్రియాంక చోప్రా తన సరోగసీపై స్పందించింది. తన కూతురు మాల్తీ పుట్టిన సమయంలో ఆపరేషన్ థియేటర్ లో వున్నానని, మాల్తీ అప్పుడు చాలా చిన్న పిల్ల అని పేర్కొంది. కొన్ని రోజులు ఇంక్యూబేటర్ లో కూడా వుంచారని ప్రకటించింది. దీంతో తన భర్త నిక్, తాను ఎంతో బాధపడ్డామని పేర్కొంది. ఆ సమయంలో డాక్టర్లు, నర్సులు తన కూతుర్ని కాపాడారని పేర్కొంది. అయితే.. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, అందుకే సరోగసిని ఎంచుకున్నామని ప్రకటించింది. అంతేకానీ.. అందం తగ్గిపోతుందని ఇలా చేశానని కొందరు అనడం తనకు చాలా బాధ కలిగించిందని ప్రియాంక చోప్రా పేర్కొంది.

Related Posts

Latest News Updates