టీచర్ గా మారిపోయిన నిత్యా మీనన్.. సినిమా కోసం కాదు సుమా…

క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ కాస్త టీచర్ గా మారిపోయారు. సినిమాలో కాదు సుమా.. నిజంగానే ఆమె టీచర్ అవతారం ఎత్తారు. సినిమా కోసం కూడా కాదు. నిజంగానే నిత్యా మీనన్ టీచర్ గా మారిపోయారు. నిత్యా మీనన్ ప్రస్తుతం మలయాళీ సినిమాలో నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ రామకృష్ణాపురంలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ తర్వాత దగ్గర్లో వున్న ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. అక్కడి చిన్నారులతో సరదాగా గడిపారు. ఇంగ్లీష్ పాఠాలు బోధించారు. అంతేకాకుండా వారికి తెలుగులో కూడా అర్థమయ్యేట్లు వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను నిత్యా మీనన్ షేర్ చేశారు. పిల్లలు తన చుట్టూ వున్నప్పుడు ఎంతో సంతోషంగా వున్నానంటూ తెలిపారు.

Related Posts

Latest News Updates