‘ప్రమాదం జరిగింది.. కోలుకున్నా’…. షాకింగ్ న్యూస్ ప్రకటించిన నభా నటేశ్

నభా నటేశ్… 2021 లో నితిన్ తో కలిసి మ్యాస్ట్రో సినిమాలో మెరిసింది. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక.. ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఏమీలేదు. దీంతో అసలు ఆమెకు ఏమైందని ఇండస్ట్రీలో, అభిమానుల్లో చర్చించుకోవడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత నభా నటేశ్ మళ్లీ టచ్ లోకి వచ్చింది. తనకు ప్రమాదం జరిగిందని షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. ఈ ప్రమాదంలో ఎడమ భుజం భాగంలో ఎముకలు విరిగాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పలు సర్జరీలు కూడా జరిగాయని వెల్లడించింది. నేను ఊహించని భౌతిక, మానసిక వేదనను అనుభవించా. గాయాల నుంచి కోలుకునేందుకు నాకెంతో ఇష్టమైన సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నా. అని ప్రకటించింది. అయితే.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని, అందుకు సంతోషగా వుందని తెలిపింది. గతంలో ఎన్నడూ లేనంత బలంగా కమ్‌బ్యాక్‌ ఎంట్రీ ఇస్తున్నా. హలో 2023.. మీ అందరి కోసం నేను సిద్ధంగా ఉన్నానని సందేశంలో రాసుకొచ్చింది నభా నటేశ్‌.

https://twitter.com/NabhaNatesh/status/1612685431371628546?s=20&t=Ip2ztffdxzC-_b4IUqW5vA

Related Posts

Latest News Updates