కియారా అద్వానీ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఫిబ్రవరి 6 న అంటూ ప్రచారం

వరుస సినిమాలు చేస్తున్న కియారా అద్వానీ పెళ్లి సెట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 6 న జైసల్మేర్ లో కియారా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర వివాహం జరగబోతోందట. ఫిబ్రవరి 4,5 తారీఖుల్లో మెహిందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరుగుతాయని మీడియా పేర్కొంటోంది. 2020 నుంచి కియారా అద్వాని, సిద్ధార్థ్ మల్హోత్రాలు డేటింగ్‌‌‌‌లో ఉన్నారు. మరోవైపు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లికి సన్నాహాలు జోరందుకున్నాయి.

అయితే తమ వివాహంపై అటు కియారా కానీ, సిద్ధార్థ్ కానీ ఇంకా స్పందించలేదు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్యాలెస్ హోటల్‌లో రాచరిక పద్ధతిలో వీరి పెళ్లి జరగనుంది. ప్రి వెడ్డింగ్‌ ఈవెంట్స్‌ తో పాటు మొత్తం మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరగనున్నాయట.కుటుంబ‌స‌భ్యులు,స‌న్నిహితుల‌తో పాటు కొద్ది మంది బాలీవుడ్ ప్రముఖులు సిధ్‌, కియారా పెళ్లికి హాజ‌రుకానున్నారట. జ‌న‌వ‌రిలో త‌మ పెళ్లి గురించి సిద్ధార్థ్‌, కియారాలు అధికారిక ప్రకటన చేసే అవ‌కాశం ఉందని సమాచారం.

 

 

Related Posts

Latest News Updates