”ఎమర్జెన్సీ” షూటింగ్ కోసం పార్లమెంట్ కు లేఖ రాసిన కంగనా రనౌత్

నటి కంగనా రనౌత్ ఆధ్వర్యంలో ”ఎమర్జెన్సీ” పేరుతో సినిమా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ సమయంలో దేశంలో పరిస్థితులు ఎలా వున్నాయో… వివరించే సినిమా ఇదీ. అయితే… కంగనా ఈ మధ్య లోక్ సభ కార్యాలయానికి ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. తాను ఎమర్జెన్సీ అనే సినిమా తీస్తున్నానని, ఇందుకు సంబంధించి పార్లమెంట్ లో కొన్ని సన్నివేశాలను చిత్రించేందుకు అనుమతి కావాలని కోరారు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉందని, అనుమతి లభించకపోవచ్చని పలువురు భావిస్తున్నారు.

 

సాధారణంగా పార్లమెంట్ ఆవరణలో షూటింగ్ లేదా వీడియోగ్రఫీ చేయడానికి ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఉండదు. ఇది ఏదైనా అధికారిక లేదా ప్రభుత్వ పని కోసం జరిగితే అది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో చిత్రీకరణకు ప్రభుత్వ ఛానళ్లైన దూరదర్శన్‌, సంసద్‌ టీవీలకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఉంటుంది. మరి పార్లమెంట్ సెక్రెటేరియట్ కంగనాకు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Related Posts

Latest News Updates