కైకాల మరణం అత్యంత బాధాకరం : జయప్రద

కైకాల సత్యనారాయణ గారి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు ప్రముఖ నటి జయప్రద. ఈ విషాద వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని ఆమె పేర్కొన్నారు. “అడవిరాముడు, యమగోల” తదితర ఎన్నో చిత్రాల్లో కలిసి నటించినప్పటి జ్ఞాపకాలను ఆమె నెమరువేసుకున్నారు. నటనకు నిఘంటువు వంటి సత్యనారాయణ స్థానం తెలుగు చిత్రసీమలో చెక్కు చెదరనిదని ఆమె పేర్కొన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు జయప్రద సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం జయప్రద ఛత్తీస్ గఢ్ షూటింగ్ లో వున్నారు.

Related Posts

Latest News Updates