అమీర్‌పేట్ లో బాబా టెక్స్‌టైల్ మెషినరీ ని ప్రారంభించిన్న సినీనటి లహరి షారి…

తెలంగాణ రాష్ట్రంలో ప‌రిశ్రమ‌ల ఏర్పాటుకు, వ్యాపారాభివృద్దికి ఎంతో అనుకూల‌మైన ప్రాంతం అని బాబా టెక్స్‌టైల్ మెషినరీ బిజినెస్ హెడ్ కేశవ్ అగర్వాల్ అన్నారు.

సినీనటి లహరి మాట్లాడుతూ బాబా టెక్స్‌టైల్ మెషినరీ ఇంత పెద్ద కంపెనీ హైదరాబాద్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంబ్రాయిడరీ ద్వారా మహిళా తన స్వతహాగా ఎదుగుతున్నది అని టెక్స్‌టైల్ పరిశ్రమలో మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంబ్రాయిడరీ మెషీన్లు, బాబా టెక్స్‌టైల్ మెషినరీ యొక్క ఉత్పత్తి శ్రేణి యొక్క ప్రత్యేకత, తమ వ్యాపారాలను స్థాపించడానికి మరియు ఆర్థికంగా ప్రయత్నించే మహిళా వ్యాపారవేత్తలకు మహిళల ఎదుగుదలకు ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో హాష్ టాగ్ ఎపి 31 మూవీ మరియు వరుణ్ తేజ్ మూవీస్ తో నటిచాను అని అన్నారు.

బాబా టెక్స్‌టైల్ మెషినరీ బిజినెస్ హెడ్ శ్రీ కేశవ్ అగర్వాల్ మాట్లాడుతూ మా బాబా టెక్స్‌టైల్ మెషినరీ “తెలంగాణ రాష్ట్రం ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు, వ్యాపారాభివృద్దికి ఎంతో అనుకూల‌మైన ప్రాంతం.
కంప్యూటరైజ్డ్‌ ఎంబ్రాయిడరీ యంత్రాకలు పెరుగుతు డిమాండ్‌ కారణంగా ప్రముఖ బాబా టెక్స్ టైల్‌ మెషినరీ సంస్థ రాష్ట్రంలో తొలి శాఖను హైదరాబాద్‌ ప్రారంభించ్చాం. రాష్ట్ర ప్రభుత్వం సహాకారం అందిస్తున్న కార‌ణంగానే రాష్ట్రంలో మొట్టమొద‌టి శాఖ‌ను ప్రారంభించామని కేశవ్‌ అగర్వాల్‌ తెలిపారు. త‌ద్వారా ఇక్కడి ప్రజ‌ల‌కు త‌మ ఉత్పత్తుల‌ను మ‌రింత చేరువ చేసే అవకాశం కలుగుతుందన్నారు. దేశంలో ఇప్పటికే ఎనిమిది స్టోర్‌ అందుబాటులో ఉన్నాయని…రాష్ట్రంలో ఇదే తొలిస్టోర్‌ అని అన్నారు. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్, జాక్వర్డ్‌తో కూడిన రేపియర్ లూమ్, ఫ్లాట్ నిట్టింగ్ మెషిన్, హాట్‌ఫిక్స్ సెక్విన్ సబ్‌టైల్ డిజిటైల్ మెషిన్, స్పాంగిల్ మెషిన్, స్పాంగిల్ మెషీన్ వంటి విస్తృతమైన శ్రేణి ఉత్పత్తులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారుల సంతృప్తికి అనుగుణంగా అద్భుతమైన నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
మిస్టర్ మురారి లాల్ పరశురాంపూరియా (డైరెక్టర్), రాఖీ దేవి పరశురాంపూరియా (డైరెక్టర్) & ముకుంద్ అగర్వాల్ (బిజినెస్ హెడ్), కేశవ్ అగర్వాల్ (బిజినెస్ హెడ్) నేతృత్వంలోని కంపెనీ మ‌రింత జాగ్ర‌త్త‌గా ముందుకు సాగుతుంది.
ఈ కార్యక్రమంలో సంస్థకు సంబంధించిన డైరెక్టర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates