టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. యువ నటుడు సుధీర్ వర్మ విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుధీర్ మృతి విషయాన్ని ఆయనతో కలిసి నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా ద్వార తెలిపాడు. సుధీర్ మరణ దిగ్భ్రాంతికరమని, జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపాడు. సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో సుధీర్ వర్మ చనిపోయాడు. సూసైడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. సుధీర్ వర్మ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. సుధీర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూట్ ఔట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ నటించాడు. మరోవైపు సుధీర్ వర్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. ఆయనది ఆత్మహత్య కాదని, అనారోగ్యంతోనే హాస్పిటల్లో చేరాడని కుటుంబీకులు అంటున్నారు.












