తమిళ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబీకులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చెన్నైలోని కొడంబక్కంలోని మెడ్వే ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కొంత కాలంగా ప్రభు కిడ్నీకి సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించారు. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ప్రభు ఆరోగ్యం నిలకడగానే వుందని, లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించామన్నారు. మరో 3 రోజుల్లో ప్రభును డిశ్చార్జీ చేస్తామని వైద్యులు ప్రకటించారు. ఇక… తెలుగు సినిమాలు చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాలతో పాటు పలు చిత్రాల్లో నటించి, గుర్తింపు పొందారు ప్రభు.












