రెండు రోజుల్లో ఓ ప్రత్యేక వార్త చెబుతా : మంచు మనోజ్ సస్పెన్స్ ట్వీట్

నటుడు మంచు మనోజ్ సస్పెన్స్ కి తెరలేపాడు. మరో రెండు రోజుల్లో తన జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేక వార్తను అందరితో పంచుకుంటానని వెల్లడించాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. తన గుండెకు ఎంతో చేరువైన ఓ ప్రత్యేక విషయాన్ని నాలోనే దాచుకొని వుంచుకున్నాను. జీవితంలోని మరో దశలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా వుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 20 న ప్రకటిస్తా అని తెలిపాడు. ప్రజలందరి ఆశీస్సులు కావాలని కోరాడు.

https://twitter.com/HeroManoj1/status/1615564635905875969?s=20&t=ucfRimqy575F5LS2AyV-Zg

Related Posts

Latest News Updates