సినీ పరిశ్రమలో విషాదం.. మలయాళ హాస్యనటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ హాస్యనటుడు ఇన్నోసెంట్‌ మరణించాడు. కోవిడ్‌ సంబంధిత సమస్యతో గత పాతిక రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడటంతో కన్నుమూశాడు. ఆయన మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇన్నోసెంట్‌ కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా, రచయితగా, సింగర్‌గా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

‘నృతశాల’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఇన్నోసెంట్‌ ఇప్పటివరకు దాదాపు 750సినిమాల్లో నటించాడు. ‘మ‌జావిల్ కావ‌డి జాత‌కం’, ‘ప‌థం నిల‌యిలే తీవండి’, ‘రావ‌ణ‌ప్ర‌భు’, ‘వేషం’, ‘స్నేహ‌వీడు’, ‘మ‌న‌సిన్న‌క్క‌రే’తో పాటు ప‌లు మ‌ల‌యాళ సినిమాల్లో త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల‌కు అలరించాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘పచ్చవుమ్‌ అద్భుతవిలక్కుమ్‌’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

 

నటుడు ఇన్నోసెంట్​ లోక్​ సభ ఎంపీగా కూడా సేవలందించారు. 2014 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా చాళ‌కూడి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. ఇక మ‌ల‌యాళ చిత్రసీమ‌లో దిగ్గజ హాస్యన‌టుల్లో ఒక‌రిగా ఇన్నోసెంట్ పేరుతెచ్చుకున్నారు.

Related Posts

Latest News Updates