”చెడ్డీగ్యాంగ్ తమాషా” సినిమా ట్రైలర్ ను హాస్య నటుడు బ్రహ్మానందం విడుదల చేశారు. వెంకట్ కల్యాణ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ఇది. గాయత్రీ పటేల్ హీరోయిన్. సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాత. ఇక… చెడ్డీగ్యాంగ్ తమాషా ట్రైలర్ ను విడుదల చేసిన తర్వాత బ్రహ్మానందం మాట్లాడారు. ట్రైలర్ చాలా సహజంగావుందని, కుర్రాళ్ల ప్రయత్నం ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ…‘అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా ఉంటుందని, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. హీరో వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ…‘పల్లె ప్రజలను పీడిస్తున్న ఊరి పెద్దను విప్లవ భావాలున్న ఓ యువకుడు ఎలా ఎదిరించాడు అనేది ఈ చిత్ర కథాంశం. దీన్ని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించాం.’ అన్నారు.