లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం “అభిరామ్” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి ఈ మద్యే యుట్యూబ్ లో విడుదల చేసిన ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల – ఓ సైదులో సైదులా నా గుండె గుంజు కెళ్లే’ లిరికల్ సాంగ్ కు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సందర్బంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ చిత్రంలోని పాటలను టిప్స్ ఆడియో ద్వారా విడుదల చేయడానికి ముందుకు వచ్చిన టిప్స్ మ్యూజిక్ వారికి ధన్యవాదములు తెలిపారు చిత్ర మేకర్స్.
చుట్టు చుట్టు పట్టి చీరను కట్టి –
చుట్ట కట్టి గుండె కొంగున చుట్టి,
కట్ట కట్టి నిన్ను బుట్టలో పెట్టే అగ్గి పెట్టె ..అగ్గే పెట్టే
అట్ట ఇట్ట చూసి కన్నే కొట్టి –
చిట్టి గుండె చుట్టూ దారం చుట్టి
పట్టుబట్టి ప్రేమ ముగ్గులో నెట్టే.. పిల్ల..గా..డ, అల్లా రో..డా..
హే సైదులో సైదులా ఆ నంగనాచి పిల్ల –
ఓ సైదులో సైదులా నా గుండె గుంజు కెళ్లే
సైదులో సైదులా..ఈ నాటు పోరగాన్నే –
సైదులో సైదులా నట్టేట ముంచే టోళ్లే
ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటే.. యాత్ కు కిక్కేక్కించేలా చాలా హుషారుగా ఉన్న ఈ పాటకు సాగర్ నారాయణ లిరిక్స్ అందించగా మీనాక్షి భుజంగ్ అద్భుతమైన సంగీతం అందించారు. ఉమా నేహా,సింహ లు చాలా చక్కగా ఆలపించిన ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ చంద్ర కిరణ్ హీరో హీరోయిన్స్ తో చక్కటి నృత్యాన్ని చేయించారు.జగదీశ్ కొమరి సినిమాటోగ్రఫీగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.టిప్స్ ఆడియో మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తాయి. లవ్ యాక్షన్ కామెడీ సెంటిమెంట్ కలయికతో ఒక విన్నూత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు మేకర్స్ నటీ నటులు యష్ రాజ్, నవిమి గాయక్, శివబాలాజీ, నవీన్ రెడ్డి, బాహుబలి ప్రభాకర్, రఘు బాబు, కాదంబరి కిరణ్, అన్నపూర్ణమ్మ, తులసి,వై విజయ, సుమన్ శెట్టి, విజయ రంగనాథ్,గౌతమ్ రాజు, జబర్దస్త్ శేషు, కిషోర్ దాస్, తదితరులు సాంకేతిక నిపుణులు బ్యానర్ : లెజెండరీ ఎంటర్టైన్మెంట్ నిర్మాత : జింకా శ్రీనివాసులు దర్శకత్వం : రామకృష్ణార్జున్, డి. ఓ. పి: కొమరి జగదీష్, ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం మీనాక్షి భుజంగ్ , పాటలు : సాగర్ నారాయణ్ ఎం. స్టంట్స్ : వించన్ అంజి, డాన్స్ మాస్టర్ : చంద్ర కిరణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : ఉల్లగంటి ప్రసాద్ పి. ఆర్ ఓ : మధు వి. ఆర్