శ్రద్ధా వాకర్ హత్య కేసు : ఇసుమంతైనా పశ్చాత్తాపం లేని అఫ్తాబ్…

కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమిన్ పూనావాలాకు టెలిగ్రాఫ్ టెస్టును అధికారులు నిర్వహించారు. ఈ విచారణలో నేరాన్ని అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ అధికారులు తెలిపారు. అయితే… శ్రద్ధ వాకర్ ను ముక్కలు ముక్కలుగా చేసి చంపినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అతడు చెప్పాడని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా శ్రద్ధా వాకర్ తో పాటు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో అఫ్తాబ్ సాధారణంగానే వున్నాడని పేర్కొన్నారు. ఇక… శ్రద్ధా వాకర్ ను హత్య చేసిన తర్వాత శవాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరినట్లు కూడా అంగీకరించారు.

 

సహజీవనం చేస్తున్న శ్రద్ధ ను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచాడు. రోజూ కొన్ని శరీర భాగాలను తీసుకెళ్లి… అడవిలో విసిరేశాడు. 18 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా సంచలనం రేగింది. దీంతో నవంబర్ 12న అఫ్తాబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Posts

Latest News Updates