డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో యూనిక్ థ్రిల్ల‌ర్‌గా స‌మిధ‌, డిసెంబ‌రు 14న గ్రాండ్ రిలీజ్‌

క‌న్న‌డ సుప్రీమ్‌ హీరో శ‌శికుమార్ త‌న‌యుడు ఆదిత్య‌ శ‌శికుమార్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం స‌మిధ‌. చాందిని త‌మిళ‌ర‌స‌న్‌, లావ‌ణ్య సాహుకార హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మర్మం‌, ‘కనులు కలిసాయివంటి ఐదు అవార్డు విన్నింగ్‌ షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించిన సతీష్ మాలెంపాటి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అరుణం ఫిలింస్ నిర్మిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీత ద‌ర్శ‌కుడు. రాజ‌స్థాన్‌లో జ‌రిగిన య‌థార్ధ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ డిసెంబ‌రు 14న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర ద‌ర్శ‌కుడు సతీష్ మాలెంపాటి మాట్లాడుతూ – రాజ‌స్థాన్‌లో జ‌రిగిన‌ ఒక య‌దార్ధ క‌థ‌ని ఇన్స్‌పిరేష‌న్‌గా తీసుకుని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా అన్నిక‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్నిరూపొందించ‌డం జ‌రిగింది. ఈ సినిమా ఆధ్యంతం ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తోపాటు చేజింగులు, యాక్ష‌న్ సీన్స్‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కులని ఎంగేజ్ చేస్తుంది. రెండు గంట‌ల క్రిస్పీ ర‌న్‌టైమ్ క‌చ్చితంగా ఆడియ‌న్స్‌కి ఒక ఫ‌ర్ఫెక్ట్ థ్రిల్ల‌ర్ చూసిన అనుభూతినిస్తుంది. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ బాష‌ల్లోని ప్ర‌ముఖ న‌టీన‌టులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో అల‌రిస్తారు. మా హీరో ఆదిత్య‌ శ‌శి కుమార్‌కి ఈ సినిమా త‌ప్ప‌కుండా మంచి విజ‌యాన్ని అందిస్తుంది. డిసెంబ‌రు 14నస‌మిధ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. త‌ప్ప‌కుండా మీ అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని భావిస్తున్నాను“ అన్నారు.

హీరో ఆదిత్య‌ శ‌శికుమార్ మాట్లాడుతూ – “ స‌మిధ ఒక థ్రిల్ల‌ర్ క‌థాంశం అయినా ఇన్‌బిల్ట్ ఒక‌ ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఉంటుంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా హీరోగా నాకు, ద‌ర్శ‌కుడిగా స‌తీష్ మాలెంపాటిగారికి మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నాను“ అన్నారు.

న‌టీన‌టులు: ఆదిత్య‌ శ‌శి కుమార్‌, చాందిని తమిళరసన్, లావణ్య సాహుకార‌, రవి కాలే, పోసాని కృష్ణముర‌ళి, శ్రవణ్, మరిముత్తు, బ్లాక్ పాండీ, సుమేష్ మూర్, అచ్యుత్ కుమార్, హర్షవర్ధన్ అహ్లావత్, గుర్నీత్ సింగ్ ,సన్నీ లియోన్,కరణ్, క్రేన్ మనోహర్, గిరిజా హరి, జబర్దస్త్ గ్యాంగ్, S.D. సతీష్ చంద్ర, రఘు రమణ కొప్ప, యాదమరాజు

Related Posts

Latest News Updates