దేశ వ్యాప్త భారత్ జోడో యాత్రలో వున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ వచ్చింది. ఇండోర్ లోకి అడుగు పెట్టగానే ఆయన్ను బాంబులతో చంపుతామంటూ ఓ లేఖని పోలీసులు కనుగొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు… లేఖ దొరికిన ప్రాంతంలోని సీసీ టీవీఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎవరు అక్కడ లేఖ పెట్టారని ఆరా తీస్తున్నారు. అయితే…. రాహుల్ లక్ష్యంగానే అని అందులో లేదని పోలీసులు అంటున్నారు. దీనిపై తాము దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే… వెంటనే దర్యాప్తును ప్రారంభించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తమ నేతకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర మహారాష్ట్రలో సాగుతోంది. మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.












