తెలంగాణలో టిఆర్ ఎస్ పేరుతో కొత్త పార్టీ రాబోతోందని సమాచారం. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) లేదా తెలంగాణ రైతు సమితి/సమాఖ్య (టీఆర్ఎస్) పేరుతో పార్టీని రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోని కొందరు కీలకనేతలు సారథ్యం వహించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు అసంతృప్త నేతలు ఈ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక టీఆర్ఎస్ పేరుతో తెలంగాణలో పార్టీ ఉంటే ఓట్లు అన్నీ అటు వైపే పడుతాయి, బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలే అవకాశాలు మెండుగా ఉంటాయని అంచనావేస్తున్నారు.