అమెరికాను భయపెడుతున్న కొత్త కరోనా వేరియంట్

అమెరికాను  ప్రస్తుతం ఓ కొత్త కరోనా వేరియంట్ భయపెడుతోంది. ఇటీవల కాలంలో భయటపడుతున్న కేసుల్లో అధికభాగం ఈ వేరియంట్ వల్లేనని అమెరికా అంటువ్యాధుల నిరోధక సంస్థ సీడీసీ  తాజాగా తెలిపింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 40 శాతం ఒమిక్రాన్  రకానికి చెందిన ఎక్స్‌బీబీ.1.5  వల్లేనని సీడీసీ  పేర్కొంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లోని 75 శాతం కేసుల్లో ఈ వైరస్ బయటపడిందని చెప్పుకొచ్చింది. అయితే, ఈ వైరస్‌తో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందనేందుకు ఆధారాలేవీ లేవని సీడీసీలోని రెస్పిరేటరీ వైరస్‌ల అధ్యయన విభాగం డైరెక్టర్ డా. బార్బరా మాహన్ పేర్కొన్నారు.  కొత్త వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో కొవిడ్ కేసుల సంఖ్య అసాధారణ రీతిలో తక్కువగానే ఉంటోందని మాహన్ తెలిపారు. అయితే,  టీకాల ద్వారా సమకూరిన వ్యాధి నిరోధక శక్తిని అధిగమించగల సామర్థ్యం కొత్త వేరియంట్‌కు ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఈ వేరియంట్ దేశంలో ఎలా ప్రవేశించిందో స్పష్టత లేకపోయినప్పటికీ,  అనేక ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది.

Related Posts

Latest News Updates