బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం

బెంగాల్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి  సమావేశమయ్యారు. సువేందుతోపాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా సీఎం చాంబర్‌లోకి వెళ్లారు. సమావేశం అనంతరం సువేందు మాట్లాడుతూ ఇది మర్యాద పూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. అంతకుమందు అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవంపై మమత మాట్లాడుతూ సువేందు తనకు సోదరుడిలాంటి వాడు అని చెప్పారు.  సువేందు తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఇరువురు నేరుగా తలపడిన తర్వాత వారిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. అసెంబ్లీ సమావేశం విరామం సమయంలో సువేందుకు చాయ్‌ తాగేందుకు దీదీ ఆహ్వానించారు.

Related Posts

Latest News Updates