రెండున్నర గంటలు నాన్ స్టాప్’గా ఎంటర్’టైన్ చేసే చిత్రం “నేను – కీర్తన” -చిమటా రమేష్ బాబు

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ… “నేను – కీర్తన” చిత్రం కోసం నేను ఎంతగానో శ్రమించాను. దర్శకుడిగా హీరోగా నా శ్రమకు తగ్గ ఫలితం లభించి, చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు… ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. రెండున్నర గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేసే మల్టీ జోనర్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు!!

నటీనటుల విషయానికి వస్తే:

రిషిత, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ 

టెక్నికల్ టీం:

పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ – సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ – అంచుల నాగేశ్వరరావు – శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!

Related Posts

Latest News Updates