ఘనంగా జరిగిన లయన్ ఆరిగపూడి డాక్టర్ విజయ్ కుమార్ గారి బర్త్ డే వేడుక లో ఓ తండ్రి తీర్పు ట్రైలర్ లాంచ్

తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రముఖ నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ ఓ తండ్రి తీర్పు ట్రైలర్ లాంచ్ చేసి మాట్లాడుతూ…

” మంచి కుటుంబ కథా బలం ఉన్న ఓ తండ్రి తీర్పు లాంటి సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇలాంటి చిత్రాలు నిర్మించే నిర్మాతలకు మా ఫిలిం ఛాంబర్ సపోర్టు ఎప్పుడూ ఉంటుంది.

ట్రైలర్ చూస్తేనే సినిమా ఎంత బాగుంటుందో అర్థమవుతుంది.
ఓ తండ్రి తీర్పు నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి, దర్శకులు ప్రతాప్ భీమవరపు, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన రాజేంద్ర రాజు కాంచనపల్లి తమ ఎఫర్ట్స్ ఫుల్ గా పెట్టారు. ఆల్ ది బెస్ట్. “
అన్నారు. లయన్ డాక్టర్ ఆరిగపూడి విజయకుమార్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ కుమార్ అభిమానులు
మరియు ఓ తండ్రి తీర్పు యూనిట్ ఫిలిమ్ చాంబర్లో
ఘనంగా సన్మానించి
వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరిగపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ…
” నా జీవితాన్ని మలుపు తిప్పిన మనిషి శ్రీరామ్ దత్తి … నేను కళా రంగంలోకి రావడానికి ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఆయనే కారణం.

నా పుట్టినరోజు అనగానే ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు గా భావించి సంబరాలు చేసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది.

సామాజిక ఇతివృత్తంతో తీసిన
ఓ తండ్రి తీర్పు సినిమా అద్భుతంగా వచ్చింది. చిత్ర నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి గారికి దర్శకుడు ప్రతాపరెడ్డి గారికి అభినందనలు.

ఇక రచన దర్శకత్వ పర్యవేక్షణ చేసిన మా రాజేంద్ర రాజు కాంచనపల్లి అందరితో కలిసిపోతూ,అందరినీ కలుపుతూ తలలో నాలుకలా
మా మనసులు దోచుకున్నాడు. భవిష్యత్తులో అతను మంచి దర్శకుడు అవుతాడు. అలాగే ఇందులో యంగ్ హీరోగా నటించిన సన్నీ కునాల్ అద్భుతమైన ఫిజిక్ తో ఫిట్ గా ఆకట్టుకుంటున్నాడు.
గాడ్ బ్లెస్స్ యు కునాల్ . “
అన్నారు.

నిర్మాత శ్రీరామ దత్తి మాట్లాడుతూ…
” నా మొట్ట మొదటి సినిమానే ఇంత మంచి సినిమా తీసి సినీ కళామ తల్లికి అంకితం చేసినందుకు చాలా గర్వపడుతున్నాను” అని అన్నారు.

దర్శకుడు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ…
“ఏవీకే గారి ఆశీర్వాదం శ్రీరామ్ దత్తి గారి సహకారంతో ఇంత మంచి సినిమా తీయగలిగాను” అన్నారు.

దర్శకత్వ పర్యవేక్షణ చేసిన రాజేంద్ర రాజు కాంచనపల్లి మాట్లాడుతూ…
” ఈ సమాజంలో ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక సమస్యతో ప్రతి ఒక్కరూ బాధపడుతూనే ఉన్నారు. కుటుంబ సభ్యుల వల్లనే బాధ పడాల్సిన రావడం చాలా కష్టంగా ఉంటుంది.తల్లి తండ్రి కొడుకు కూతుళ్ళ మధ్య జరిగే సంఘర్షణ మా ఈ ఓ
తండ్రి తీర్పు. ” అని అన్నారు.

యంగ్ ఛార్మింగ్ హీరో సన్నీ కునాల్ మాట్లాడుతూ…
” పూజ్యులు ఆరిగ పూడి విజయ్ కుమార్ గారి సేవా కార్యక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. స్ఫూర్తిదాయకంగా ఉంది.

వారు సమర్పించిన సినిమాలో శ్రీరామ్ దత్తి గారి ఆశీర్వాదంతో ఓ తండ్రి తీర్పు సినిమాలో చేయడం నా అదృష్టం. డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఇంత మంచి సినిమా ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది. తప్పకుండా చూడండి ఆశీర్వదించండి. “అని అన్నారు.

హీరోగా నటించిన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి మాట్లాడుతూ…
” సోదర సమానుడు
ప్రముఖ సినీ టీవీ రచయిత రాజేంద్ర రాజు ప్రోత్సాహం వల్ల ఈ సినిమాలో హీరోగా చేశాను.. ఇది అన్ని సినిమాల్లా వచ్చి పోయే సినిమా కాదు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే సినిమా.
బర్నింగ్ ప్రాబ్లం మీద
తిరుగులేని సొల్యూషన్ ఇచ్చే గొప్ప సినిమా. ప్రేక్షకులు ఈ సినిమా తప్పకుండా చూడాలి. ” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది సినీ టీవీ ప్రముఖులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates