అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. టెక్సాస్‌లోని డల్లాస్‌లో వైమానిక ప్రదర్శన జరుగుతున్న సమయంలో బోయింగ్ బీ`17 బాంబర్ యుద్ధ విమానం, పీ`63 కింగ్ కోబ్రా యుద్ధ విమానం రెండూ ఢీకొన్నాయి. అయితే, బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పిన కోబ్రా యుద్ధ విమానం వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద శబ్ధంతో విమానాలు నేలపై కుప్పకూలిపోయాయి. ఆకాశంలోనే విమానం ముక్కలైంది. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్య వివరాలపై ఆంకా సమాచారం అందలేదు. ఈ ప్రమాదంలో పైలట్ల గురించిన సమాచారం ఇంకా నిర్ధారించలేదని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) వెల్లడిరచింది.
