భగవంత్ కేసరి సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట ప్రచారమవుతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. https://cinemaabazar.com/
అయితే నిధి, ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటిస్తుందా లేక కీలకపాత్రలో నటిస్తుందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా నిధి ఎంట్రీతో ఆ ఛాన్స్ ఆమె తీసుకుంటుందా అని అనుమానాలొస్తున్నాయి. నిజంగా నిధికి ఆ ఛాన్స్ దక్కితే మాత్రం అమ్మడి పంట పండినట్లే. https://cinemaabazar.com/
ఇప్పటికే అవకాశాల కోసం రెండేళ్లు గా ఎదురుచూస్తున్న నిధికి హరిహర వీరమల్లులో ఛాన్స్ వచ్చినప్పటికీ ఆ సినిమా ఆగిపోయింది. మళ్లీ స్టార్ట్ అవుతుందో లేదోనన్నది తెలియదు. దీంతో నిధి చాలా నిరుత్సాహ పడింది. ఇలాంటి టైమ్ లో బాలయ్య సినిమాలో ఛాన్స్ అంటే మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక తిరిగి ఎన్బీకే109 షూటింగ్ లో బాలయ్య పాల్గొననున్నాడు. అప్పటివరకు బాలయ్య లేని సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అందులో భాగంగానే నిధి అగర్వాల్ పై కొన్ని సీన్స్ ను షూట్ చేసే ఛాన్సుంది.