పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత రాజ్ కుమార్ మన్నా ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ముగ్గురు మరణించారు. అయితే టీఎంసీ నేత ఇంట్లోకి బాంబులు ఎలా వచ్చాయన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేపట్టనున్న ర్యాలీ వేదికకు సమీపంలోనే టీఎంసీ నేత నివాసం వుంది. ఈ నివాసంలోనే బాంబు పేలింది. ఈ పేలుడుకు ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. ముగ్గురు చనిపోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ నేత ఇంట్లో నాటు బాంబులు తయారీ చేస్తున్నారని, అందుకే పేలాయని బీజేపీ ఆరోపించింది.
Wb | A blast occurred at residence of TMC booth president Rajkumar Manna in Arjun Nagar area under Bhupati Nagar PS in Purba Medinipur limits last night. Injuries reported. Party's National General Secretary Abhishek Banerjee is scheduled to hold a public rally in Contai today. pic.twitter.com/1ynqX7G6S3
— ANI (@ANI) December 3, 2022