ఇంటర్ స్కూల్ టోర్నీలో 500కు పైగా రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు 13 ఏళ్ల కుర్రాడు. లిమిటెడ్ ఓవర్లలో విధ్వంసం సృష్టిస్తూ రికార్డు సాధించాడు. నాగ్‌పూర్‌కు చెందిన 13 ఏళ్ల యశ్ చావ్డే ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో చెలరేగిపోయాడు. బౌండరీలు , సిక్సర్లతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించాడు. 178 బంతుల్లోనే 508 పరుగులు అందుకున్నాడు. ఇన్నింగ్స్‌లో 81 ఫోర్లు, 18 సిక్సులు ఉన్నాయి. నాటౌట్‌గా కూడా నిలిచాడు. రోజుల తరబడి సాగే టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇటువంటి రికార్డు సాధిస్తే ఆశ్యర్యపోనక్కర్లేదు. కేవలం 40 ఓవర్లలోనే ఈ రికార్డును కైవసం చేసుకున్నాడు. భారత్‌లో ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీల్లో ఇదే వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. అండర్ 14 క్రికెట్ టోర్నీలో ఈ అరుదైన స్కోరు నమోదు చేశాడు.












