నా ఊపిరి..నా గుండె చప్పుడు అన్ని మీరై 44 సంవత్సరాలు నడిపించారు! : మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటికి 44 సంవత్సరాలు అయింది. ప్రాణం ఖరీదుమూవీ ద్వారా ఆయన నటుడిగా తెరంగేట్రం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి .. తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఈ పేరు మారుమోగుతూనే ఉంటుంది. నటనకు కొత్త భాష్యం చెబుతూ.. పాత్ర ఏదైనా తనకు తానే పోటీగా నటించే నటుడు ఆయన. కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. అయితే హీరో అవ్వకముందు సైడ్ క్యారెక్టర్లు, విలన్‌గా నటించిన విషయం సినీ ప్రపంచానికి తెలిసిందే. మెగాస్టార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా ప్రాణం ఖరీదు . ఈ మూవీ విడుదలై నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు.. ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ప్రాణం పోసి.. ప్రాణపదంగా, నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరై 44 సంవత్సరాలు నన్న నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. ఎప్పటికీ మీ చిరంజీవి..’ అంటూ ఆయన రాసుకొచ్చారు.

https://twitter.com/KChiruTweets/status/1572935427837030400

Related Posts

Latest News Updates