మూన్ లైటింగ్ పై విప్రో సీరియస్… 300 మంది ఉద్యోగుల తొలగింపు

ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడాన్ని విప్రో సంస్థ సీరియస్ గా తీసుకుంది. తమ కంపెనీలో చేస్తూ… మరో సంస్థలో ఉద్యోగం చేస్తున్న 300 మందిని ఉద్యోగాల నుంచి తీసేశామని సంచలన ప్రకటన చేసింది. ఇలా తమ దగ్గర ఉద్యోగం చేస్తూ… ఇతర కంపెనీల్లో కూడా ఉద్యోగాలు చేస్తే సహించమని విప్రో చైర్మన్ రిషబ్ ప్రేమ్ జీ ప్రకటించారు. మూన్ లైటింగ్ అంటే కంపెనీలను ఉద్యోగులు మోసం చేయడమేనని తాను చెప్పిన కామెంట్లకు ఇప్పటికీ కట్టుబడే వుంటానని ఆయన తేల్చి చెప్పారు.

 

తమ సంస్థలో వుంటూ… తమకు ప్రత్యర్థిగా వున్న కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న 300 మందిని గుర్తించామని, వారిని తొలగించామని పేర్కొన్నారు. ఇలాంటి వారికి తమ వద్ద స్థానం లేదన్నారు. అయితే.. తమ ఖాళీ సమయాల్లో ఏమైనా చేసుకోవచ్చని, అయితే మూన్ లైటింగ్ మాత్రం అనైతికమేనని సంస్థ పేర్కొంది.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్