ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు ఇకపై… వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ… పేరు మార్చుతున్న వైసీపీ సర్కార్

డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించుకుంది. ఎన్టీఆర్‌ పేరు తీసేసి… ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చాలని తీర్మానించుకుంది. ఇందుకు వీలుగా యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. దీనిని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టనున్నారు. దీనిని ఆమోదించగానే… డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కాస్తా, ‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం’గా మారుతుంది.

 

అయితే…. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యూనివర్శిటీ పేరును మార్చాలని వైఎస్సార్ తో సహా ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదన్నారు. 36 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఆయన పేరును తొలగించి, వైఎస్సార్ పేరు పెట్టడం అర్ధరహితమని చంద్రబాబు ఆక్షేపించారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్… ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని మండిపడ్డారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి, వైఎస్సార్ కు ఏమైనా అనుబంధం వుందా? అంటూ చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.

Related Posts

Latest News Updates