ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాత్సవ (58) కన్నుమూశారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబీకులు కూడా ధ్రువీకరించారు. ఆగస్టు 10 న శ్రీవాత్సవ జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. శ్రీవాత్సవ మరణంపై సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేశారు.

 

ఆయనకు సంతాపాన్ని ప్రకటించారు. 1980 నుంచే ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా క్రియాశీలకంగా వుండేవాడు. అయితే.. 2005 తర్వాత మాత్రం ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రసిద్ధ షోలలో కూడా పనిచేశారు. ది గ్రేట్ ఇండియన్ లాఫర్ ఛాలెంజ్, బిగ్ బాస్, శక్తిమాన్, కామెడీ సర్కస్ ది కపిల్ శర్మ లాంటి షోలలో చేశారు. అంతేకాకుండా మైనే ప్యార్ కియా, తేజాబ్, బాజీగర్ లాంటి బాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశారు. కొన్ని రోజులు ఆటో డ్రైవర్ గా కూడా పనిచేశారు. అక్కడి నుంచి కమెడియన్ గా ఎదిగారు.

Related Posts

Latest News Updates