దసరా పండగ కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సంస్థ పేర్కొంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి అదనపు బస్సులను నడుపుతామని తెలిపింది. విజయవాడ నుంచి తిరుపతి, రాయలసీమ జిల్లాలు, భద్రాచలం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపింది. అయితే… బస్సులు ప్రత్యేకమైనా… సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామని సంస్థ తేల్చి చెప్పింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తమ సంస్థ వెబ్ సైట్ లో వుంచామని ఆర్టీసీ పేర్కొంది.