రామానాయుడు స్టూడియోస్ లో A J ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూరెడ్డి విష్ణుగారి సమర్పణలో పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో నిర్మించిన “రణస్థలి” సినిమా టీజర్ రిలీజ్ చేసిన సినిమా హీరో వెంకటేష్ గారు మాట్లాడుతూ టీజర్ చాలా బాగుంది యంగ్ టీమ్, కొత్త డైరెక్టర్ అయినా పరశురాం గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి,మ్యూజిక్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పరశురాం శ్రీనివాస్ , నిర్మాత సూరెడ్డి విష్ణుగారు, కో ప్రొడ్యూసర్ .లక్ష్మీజ్యోతిశ్రీనివాస్ గారు, కెమెరామెన్ జాస్టి బాలాజీ, హీరో ధర్మ, హీరోయిన్ చాందిని రావు,ప్రశాంత్,శివ,అశోక్ సంగా,అసిస్టెంట్ డైరెక్టర్ మూర్తి,కెమెరా అసిస్టెంట్ సాయి తదితరులు పాల్గొన్నారు.