ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఇది సమయం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం పట్ల అమెరికా ప్రసార మాధ్యమాలు ప్రశంసలు కురిపించాయి. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్ వేదికగా మోదీ, పుతిన్ జరిపిన భేటీకి ప్రధాన పత్రికలన్నీ ప్రాధాన్యమిచ్చాయి. రష్యాకు భారత్ చీవాట్లు పెట్టిందంటూ విశ్లేషించాయి. పుతిన్‌పై అన్నివైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతోందన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంపై భారత్, చైనా నేతలు వ్యక్తం చేసిన ఆందోళన, యావత్ ప్రపంచ భావనను చాటుతోందని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సంబంధాల మూల సూత్రాలపై రష్యా దాడి చేస్తోందని ఆరోపించారు.