తేజస్వి బెయిల్ రద్దుచేయండి… సుప్రీంకు సీబీఐ వినతి

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) స్కామ్‌ కేసులో బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తేజస్వీ యాదవ్‌ సాదాసీదా వ్యక్తి కాదు. బాగా పలుకుబడి కలిగిన వాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులను దూషిస్తూ, బెదిరిస్తూ బహిరంగ హెచ్చరికలు చేశారు. సాక్షులకు ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు అని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది.  దీంతో అత్యున్నత ధర్మాసనం తేజస్వీయాదవ్‌కు నోటీసు జారీ చేసింది. ఈ నెల 28లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. ఐఆర్‌సీటీసీలో హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టు మంజూరు చేయడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై తేజస్వీకి గతంలో సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజస్వీకి 2018 అక్టోబర్‌లో బెయిల్‌ మంజూరైంది.

Related Posts

Latest News Updates