కేదార్నాథ్ ఆలయ గర్భగుడికి బంగారు తాపడం చేయించడాన్ని కొందరు పూజారులు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల శతాబ్దాల నుంచి వస్తున్న సంప్రదాయాలకు భంగం కలుగుతుందని అంటున్నారు. బంగారు తాపడం కోసం డ్రిల్స్ ఉపయోగిస్తే ఆలయ గోడలు దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. గుడి లోపలి గోడలకు బంగారు తాపడం చేయించేందుకు మహారాష్ట్రకు చెందిన భక్తుడు ముందుకు వచ్చాడు. అయితే బంగారు రేకులను అమర్చడానికి ఆలయ కుడ్యాలను భారీ యంత్రాలతో తూట్లు పొడవాల్సి వస్తుందని, ఇది సరికాదని కొందరు పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.