గిరిజన రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా జీవో విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే గిరిజన బంధు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. బంజార భవన్, ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

 

ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఏడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమోదించలేదని చెప్పారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు.. తాము పంపించిన గిరిజన రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని మోడీ, అమిత్ షాను ప్రశ్నించారు. దయచేసి తమ బిల్లులను ఆమోదించాలని మోడీకి కేసీఆర్ దండం పెట్టి వేడుకుంటున్నానని సీఎం అన్నారు.