ఢిల్లీ మద్యం అవినీతి వ్యవహారంలో ఈడీ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని, కొందరు దురుద్దేశపూర్వకంగానే మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. సత్యాన్ని చూపించడంలో సమయాన్ని వెచ్చిస్తే బాగుంటుందని హితవు పలికారు. టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు… సత్యాన్ని చూపించాలన్నారు. తనకెలాంటి నోటీసులూ రాలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.