ఉజ్బెకిస్తాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు

ఉజ్బెకిస్తాన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సమర్ ఖండ్ వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రధాని అరిపోవ్ సాదర స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, ఇంధన సరఫరా పెంపు, ఉగ్రవాద నిర్మూలనపై సభ్య దేశాలు చర్చిస్తాయి.

 

ఇక… ఈ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. వీరితో పాటు ఇరాన్ అధినేతతో కూడా చర్చించనున్నారు. అయితే… చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోదీ సమావేశం అవుతారా? అన్న దానిపై స్పష్టత లేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎస్ సీవో శిఖరాగ్ర సమావేశం జరగలేదు. 2019 లో జూన్ లో బిష్కేక్ లో ఈ సదస్సులో సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates