లక్షల్లో ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం మాదే.. టీడీపీది అనవసర రాద్ధాంతం : ఆర్కే రోజా

నిరుద్యోగులను మోసం చేసే చరిత్ర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుదే అని ఏపీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలేవీ టీడీపీ చర్చించడం లేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పై చర్చించాలని సభలో టీడీపీ పట్టుబట్టడంతో సభ 10 నిమిషాలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా టీడీపీపై మండిపడ్డారు. ఉద్యోగాల గురించి మాట్లాడే అర్హత టీడీపీ వుందా? అంటూ ప్రశ్నించారు.

 

సభలో టీడీపీ అనవసర సిద్ధాంతం చేస్తోందని, టీడీపీకి రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాలిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ప్రకటించారు. గ్రామాల్లో తిరిగితే ఉద్యోగాలెన్ని ఇచ్చామో తెలుస్తుందని మంత్రి రోజా అన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడిన భాషలో తప్పేమీ లేదని వెనకేసుకొచ్చారు. ఆయనపై ఈగ వాలితే సహించేది లేదని హెచ్చరించారు.

Related Posts

Latest News Updates