వ్లాదిమీర్ జెలెన్ స్కీకి యాక్సిడెంట్… విచారణకు ఆదేశించిన ఉక్రెయిన్ యంత్రాంగం

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్ స్కీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో జెలెన్ స్కీకి గాయాలయ్యాయి. ఆయన క్షేమంగానే వున్నారని ఆయన తరపు ప్రతినిధి ప్రకటించారు. రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇజియం నగరాన్ని సందర్శించి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాజధాని కీవ్ లో ఈ కారు ప్రమాదం జరిగిందని, రోడ్డుపై వెళ్తుండగా… వాహనదారుడు జెలెన్ స్కీ వాహనాన్ని ఢీకొన్నాడని తెలిపారు.

 

అయితే.. అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వల్ప గాయాలతో బయటపడ్డారని, పెద్ద ప్రమాదమేమీ లేదని ఆయన తరపు ప్రతినిధులు ప్రకటించారు. అయితే అధ్యక్షుడి వాహనాన్ని నడిపే డ్రైవర్ కు గాయాలవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ యాక్సిడెంట్ పై ఉక్రెయిన్ అధ్యక్ష భవనం అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరపాలని అధికారులను ఆదేశాలు వెళ్లాయి.

Related Posts

Latest News Updates