తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈనెల 26 నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకూ దసరా సెలవులు వుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతే మొత్తం 15 రోజుల పాటు తెలంగాణలో దసరా సెలవులుంటాయి. ఈ నెల 24 న బడులకు సెలువులు ప్రారంభమైతే… మళ్లీ అక్టోబర్ 10 న పాఠశాలలు తెరుచుకుంటాయి. అక్టోబర్ 8,9 శని, ఆదివారాలు వస్తున్న నేపథ్యంలో అక్టోబర్ 10 నే పాఠశాలలు ప్రారంభమవుతాయి.