తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు చేస్తున్న నిరసనలపై నేడు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అసెంబ్లీలోని కమిటీ హాలులో 15 మంది వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని, అర్హులకు ప్రమోషన్, కారుణ్య నియామకాలు చేపట్టాలని, మృతిచెందిన వీఆర్ఏల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై వీఆర్ఏలు ఈ సందర్భంగా మంత్రితో చర్చలు జరిపారు. సీఎం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని.. ఈ నెల 18 తేది వరకు సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు వీఆర్ఏలు తెలిపారు. సమైక్య వేడుకలు ముగిసిన తర్వాత తమ సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్ చెప్పారన్నారు. ఆందోళన విరమించాలని, ఈ నెల 20 న మరోసారి చర్చిద్దామని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడంతో వీఆర్ఏలు తమ ఆందోళనను విరమించారు.

 

మంత్రి కేటీఆర్ తో చర్చలు ప్రశాంత వాతావరణంలోనే జరిగాయని వీఆర్ఏ ప్రతినిధులు ప్రకటించారు. తమ సమస్యలన్నీ మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. వీఆర్ఏ లకు ప్రమోషన్లు, పే స్కేల్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని వీఆర్ఏ ప్రతినిధులు చెప్పారు. ఈ నెల 20 వతేదీన జాయింట్ మీటింగ్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ తమ సమస్యలు పరిష్కారిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

 

మరోవైపు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వందలాది మంది వీర్ఏలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపిన వీఆర్ఏలను పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తతంగా మారింది. అరెస్టు చేసిన వీఆర్ఏలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర 200 మంది వీఆర్ఏలను ఇప్పటికే అరెస్టు చేయగా… అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తాన్ని పోలీసులు బ్లాక్ చేశారు. అందులో భాగంగా నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి మళ్సిస్తున్నారు. సీ