పొన్నియన్ సెల్వన్-1 ఓ టి టి రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం?

భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 30న భారీ అంచనాల నడుమ థియేటర్ల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ హక్కులకు సబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ విడుదలకు సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 30న ఆడియన్స్ ముందుకు ఈ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రెండు భాగాలుగా రానున్న పీఎస్-1 ఓటీటీ హక్కులను రూ.125 కోట్లకు అమ్ముడయ్యాయని ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలకు ముందే భారీ ఆఫర్ రావడంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేస్తోంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీని ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. విక్రమ్‌ , జయం రవి , కార్తి , ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ , త్రిష , ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణమూర్తి రాసిన ప్రసిద్ధ నవల ఆధారంగా ఈ సినిమాను మణిరత్నం తెరకెక్కించారు. ఇటీవల లాంచ్ చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రూ.500 కోట్ల బడ్జెట్‌తో పొన్నియిన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related Posts

Latest News Updates