అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కొన్నిరోజులుగా 20 శాతం మార్కులు తగ్గించాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు ఆందోళన చేస్తుండగా… తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది.