వారణాసి జ్ఞానవాపి కేసుపై నేడు కీలక తీర్పు… వారణాసిలో 144 సెక్షన్

జ్ఞానవాపి కేసుపై వారణాసి జిల్లా కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనునంది. ఈ తీర్పు నేపథ్యంలో వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. వారణాసిలో ఇప్పటికే144 సెక్షన్ విధించారు. తీర్పు తర్వాత ఎటువంటి అల్లర్లు జరక్కుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై వున్న హిందూ దేవతలను ప్రతిరోజూ పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ జ్ఞానవాపి మసీదు వక్ఫ్ ఆస్తి అని పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఈ కేసును విచారిస్తోంది. గతంలో దిగువ కోర్టు కాంప్లెక్స్ ను వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. మే 16 న సర్వే పూర్తి చేసి, మే 19 న కోర్టులో నివేదిక సమర్పించారు.

Related Posts

Latest News Updates