కర్తవ్య పథ్, నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

కర్తవ్య పథ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్, మేఘ్ వాలా, మీనాక్షి లేఖీ తదితర మంత్రులతో కలిసి కర్తవ్య పథ్ ను మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మోదీ తిలకరించారు. ఇక.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేసిన కార్మికులతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. వారందర్నీ గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తామని మోదీ ప్రకటించారు.

 

 

మరోవైపు ఇండియా గేట్ వద్ద వున్న ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని మోదీ ఆవిష్రించారు. ఇండియా గేట్ ముందునన్ 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి, పూలతో అంజలి సమర్పించారు. అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారు. నేతాజీ సేవలను తరతరాలకు చాటేందుకే ఈ విగ్రహం ఏర్పాటైంది. ఇక… ఈ విగ్రహానికి ఖమ్మం జిల్లా గ్రానైట్ వినియోగించారు.

 

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్