ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడే వుందని ఏపీ మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించిన తర్వాతే గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తెస్తున్నట్లు మంత్రుల కమిటీ ప్రకటించింది. సచివాలయంలో ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంశంపై మంత్రుల కమిటీలో సభ్యులైన బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేశ్, సలహాదారు సజ్జల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు.
ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు, ఏపీ సెక్రెటేరియట్ ఉద్యోగుల నేత వెంకట్రామి రెడ్డి, కేఆర్ సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. సీపీఎస్ కంటే మెరుగ్గా జీపీఎస్ ను తెస్తున్నామని, ఇది ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేలా వుంటుందని వివరించారు. హామీ పింఛను, హామీ కుటుంబ భద్రత, వైకల్య బీమా సౌకర్యాన్ని చట్టపరంగా కల్పించేందుకు తాము సిద్ధమని మంత్రులు ఉద్యోగులకు వివరించారు.