ఎన్టీఆర్ NTR 30 మూవీలో లేడీ సూప‌ర్ స్టార్‌ విజయ శాంతి ?

RRRతో తార‌క్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తెలుగువారే కాదు.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా NTR 30 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నంద‌మూరి అభిమానులు  ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా ప్రేక్ష‌కులు తార‌క్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తారోన‌ని వెయిటింగ్‌ చేస్తున్నారు. తాజాగా NTR 30కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. లేడీ సూపర్ స్టార్ తారక్ సినిమాలో నటించనున్నారట.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్  కొత్త సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నంద‌మూరి అభిమానులు  ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌ను తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ సినిమా చేస్తార‌నే అనౌన్స్‌మెంట్ వ‌చ్చి చాలా రోజులే అయ్యింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఏమో వెయిట్ చేస్తున్నారు. కానీ.. సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఎన్టీఆర్‌, కొర‌టాల అండ్ టీమ్ NTR 30 సినిమా విష‌యంలో అల‌స‌త్వం అస్స‌లు చూపించ‌కూడ‌ద‌ని అనుకుంటున్నారు. ఆల‌స్య‌మైనా ప‌ర్లేదు కానీ.. బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేయాల్సిందేన‌ని భావిస్తున్నారు. తాజాగా NTR 30కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో నాటి లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి  క‌నిపించ‌బోతున్నార‌ట‌.రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత విజ‌య‌శాంతి సినిమాల‌కు దూర‌మ‌య్యారు. చాలా ఏళ్ల త‌ర్వాత సరిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టించి మెప్పించారు. త‌న‌కు చాలా న‌చ్చితే కానీ మ‌ళ్లీ సినిమాల్లో రోల్స్ చేయ‌న‌ని అప్పుడే ఆమె చెప్పేశారు. NTR 30లో కొర‌టాల శివ ఆమెను దృష్టిలో పెట్టుకుని ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశార‌ట‌. రీసెంట్‌గా ఆమెను క‌లిసిన‌ట్లు, క‌థ నెరేట్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి కొర‌టాల శివ నెరేష‌న్ విజ‌య‌శాంతికి న‌చ్చిందా.. ఆమె న‌టించడానికి ఓకే చెప్పిందా? అనేది తెలియ‌టం లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు.

Related Posts

Latest News Updates