పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ల లైగర్ దెబ్బకి ‘JGM’ వున్నట్టా? లేనట్టా?

సినిమాలు హిట్టవుతుంటాయి.. ఫ్లాప్ అవుతుంటాయి. అవన్నీ సహజమే. కానీ సినిమా విడుదలకు ముందు మాట్లాడిన మాటలు ఎప్పటికీ అలా మిగిలిపోతాయి. తీసిన సినిమాకు, ప్రమోషన్స్‌లో చెప్పిన దానికి కొంతైనా దగ్గరగా ఉండాలి. తీరా సినిమాను చూసిన తరువాత ప్రేక్షకుడు మరీ చీదరించుకునేలా ఉండకూడదు. లైగర్ సినిమా విడుదలకు ముందు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మీలు చెప్పిన మాటలకు.. తీసిన సినిమాకు సంబంధం లేకుండాపోయింది. దీంతో జనాలు లైగర్ టీంను ఏకిపారేస్తున్నారు. మరీ ముఖ్యంగా విజయ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో జన గణ మన మీద కొత్త టాక్ బయటకు వచ్చింది.పూరి జగన్నాథ్ సినిమాలు ఆడి చాలా రోజులే అయింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో పూరి జగన్నాథ్ ఉన్నాడని మళ్లీ గుర్తించారు. అంతకు ముందు ఎంతో మంది హీరోలకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చినా కూడా పూరి చాలా డౌన్ ఫాల్ అయ్యాడు. ఇక ఇస్మార్ట్ శంకర్‌తోనే మళ్లీ పూరి మార్క్ కనిపించింది. ఆ చిత్రం వసూళ్ల పరంగా పూరిని కష్టాల్లోంచి గట్టెక్కించింది. అయితే ఇస్మార్ట్ ఇచ్చిన విజయాన్ని.. లైగర్‌తో పోగొట్టుకున్నాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు లైగర్ సినిమాకు వచ్చిన తలనొప్పే అది. విజయ్, పూరి ఇద్దరూ కూడా వారి మాటలతో, అతి ప్రమోషన్స్‌తో సినిమాను ఆకాశంలో నిలబెట్టేశారు. కానీ కథ, కథనాలు మాత్రం కనీసం భూమి కూడా నిలవలేదు. అలా లైగర్ సినిమా ఇప్పుడు ఘోరాతిఘోరంగా బెడిసి కొట్టేసింది. ఇధి విజయ్ కెరీర్‌కు దారుణంగా దెబ్బ కొట్టేలా ఉంది.అయితే ఇప్పుడు విజయ్ టీం, ఇంటి సభ్యులు కూడా జన గణ మన మీద ఆందోళన చెందుతున్నారట. సినిమాను ఆపేద్దామనే ఆలోచనలో ఉన్నారట. అయితే విజయ్ మాత్రం పూరికి కొన్ని రోజులు టైం ఇచ్చాడట. ఈ లోపు స్క్రిప్ట్ మరింత పకడ్బందీగా రాసుకుని రమ్మన్నాడట. లేదంటే సినిమాను పక్కన పెట్టే ఆలోచనలో విజయ్ ఉన్నాడట. ఇలా జన గణ మన మీద రకరకాల రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

Related Posts

Latest News Updates